AP news: ఏపీలో వ్యాక్సినేషన్‌ పెంచండి: తెదేపా ఎంపీ
close

తాజా వార్తలు

Published : 07/06/2021 16:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP news: ఏపీలో వ్యాక్సినేషన్‌ పెంచండి: తెదేపా ఎంపీ

అమరావతి: వయో పరిమితి లేకుండా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడ రవీంద్రకుమార్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. కేంద్రం కోటా నుంచే వ్యాక్సిన్‌ సేకరణ చేసి.. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రాలకు సరఫరా చేసిన వ్యాక్సిన్‌పై పర్యవేక్షణ కూడా కేంద్రమే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరల విషయంలో వ్యత్యాసం లేకుండా చూడాలని, దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్న కనకమేడల.. వయో పరిమితి లేకుండా ఉచితంగా అందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రైవేటు భాగస్వామ్యం అవకాశం ఉన్న మేరకు తగ్గించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని