కేటీఆర్‌ ఎక్కడా..? ఎన్డీఏ అంటే ఇదే!
close

తాజా వార్తలు

Published : 01/03/2021 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేటీఆర్‌ ఎక్కడా..? ఎన్డీఏ అంటే ఇదే!

ట్విటర్‌లో నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు

హైదరాబాద్‌: ఉద్యోగాల కల్పనపై అధికార తెరాస, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే మీడియా ముందు వాదనలు వినిపిస్తున్న నేతలు సామాజిక మాధ్యమాల్లోనూ దీటుగా బదులిచ్చుకుంటున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌.. హైదరాబాద్‌ పట్టభద్రుల భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు మధ్య ఇవాళ  ట్విటర్‌లో సంవాదం జరిగింది. ఉద్యోగాలపై చర్చకు రావాలని కేటీఆర్‌కు రాంచందర్‌రావు సవాలు విసిరారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎదురు చూస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ ఎక్కడ ఉన్నారంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు.

రాంచందర్‌రావు ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌ భాజపా ఇచ్చిన ఉద్యోగాలపై సమాచారం సేకరిస్తున్నానని చురకలంటించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని మంత్రి ప్రస్తావించారు. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామన్నారనే సమాచారం లభించడం లేదన్నారు. భాజపా ఇచ్చిన వాగ్దానాలు, రూ.15 లక్షల సాయంపై సమాచారం దొరకడం లేదంటూ కేటీఆర్‌.. రాంచందర్‌రావుకు దీటుగా బదులిచ్చారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవెలేబుల్‌ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే రాంచందర్‌రావు చెప్పాలన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని