close

తాజా వార్తలు

Updated : 21/02/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాజపాలో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌

దిల్లీ: కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కూన శ్రీశైలం గౌడ్‌ భాజపాలో చేరారు. దిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడ్చల్‌ డీసీసీ అధ్యక్ష పదవితో పాటు కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన కొద్దిసేపట్లోనే శ్రీశైలంగౌడ్‌ కమలతీర్థం పుచ్చుకున్నారు. 

తెరాసపై అసలుసిసలు పోరాటం భాజపాదే: శ్రీశైలం గౌడ్‌

భాజపాలో చేరకముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి గల కారణాలను వివరిస్తూ శ్రీశైలంగౌడ్‌  ఓ వీడియోను విడుదల చేశారు.  రాజీనామా లేఖను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పంపించినట్లు ఆయన చెప్పారు. ‘‘గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. 2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిపొందాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేశాను. గత ఆరేడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగించాయి. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో వైఫల్యం చెందింది. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా తెరాస అక్రమాలపై కాంగ్రెస్ పోరాడలేదనే నిర్ణయానికి వచ్చారు. దీనికి ఉదాహరణ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే భాజపాతోనే సాధ్యమనే నిర్ణయానికి వచ్చాను. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తెరాసపై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ భాజపా. అందుకే ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా’’ అని వివరించారు.
 

 




ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని