close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120003906 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => I_8rJkAHvkQ [video_short_link] => I_8rJkAHvkQ [created_by] => [created_date] => [modified_by] => 9030164 [modified_date] => 2020-01-08 17:18:32.561923 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

రైతులపై అక్రమ కేసులు: లోకేశ్‌

గుంటూరు: మీడియాపై దాడికేసులో అరెస్టయి.. గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న అమరావతి రైతులను తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్‌, జేఏసీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ..గత ఐదేళ్లలో ఎప్పుడైనా రాజధాని రైతులు ఆందోళనలు చేశారా? ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే .. రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి చెందదన్నారు. మూడు ప్రాంతాల్లో రాజధాని ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతుందన్నారు. రాజధాని రైతులకు జేఏసీ తరఫున న్యాయ సహాయం అందిస్తామని లోకేశ్‌ తెలిపారు. పిన్నెల్లిపై దాడి ఘటనను సాకుగా చూపించి రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైతులను కించపరుస్తున్నారన్నారు. రాజధాని అమరావతికోసం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరావు మాట్లాడుతూ... ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, ఐదుకోట్ల మంది  సమస్య అని పేర్కొన్నారు. రైతులను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు ఎంపీ గల్లా  జయదేవ్‌, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌,  సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.