corona:‘మా కుటుంబం ముక్కలైంది’ 
close

తాజా వార్తలు

Published : 18/05/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

corona:‘మా కుటుంబం ముక్కలైంది’ 

కలిసి జన్మించి..కలిసి కాటికి చేరిన కవలలు

లఖ్‌నవూ: కరోనా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతోంది. ఎప్పుడు ఏ మరణవార్త వినాల్సి వస్తుందోనని ఆత్మీయులు వణికిపోతున్నారు. ఇంట్లో పెద్దవారిని బలితీసుకొని..చిన్నారులను అనాథలను చేస్తోంది. కొన్ని చోట్ల యువత కూడా దీని కాటుకు గురవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో చోటుచేసుకుంది. కవల పిల్లల్ని కాటేసి కుటుంబాన్ని ముక్కలు చేసింది.

‘మా కుటుంబం ముక్కలైంది. ఇప్పుడు మేం ముగ్గురమే మిగిలాం. నా కుమారులు జోఫ్రెడ్, రాల్ఫ్రెడ్ కొవిడ్ కారణంగా మరణించారు’ అని ఆ కవల పిల్లల తండ్రి గ్రెగరీ రఫేల్ విలపించారు. గ్రెగరీ దంపతులు మేరఠ్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారికి ముగ్గురు కుమారులు. చిన్నవాళ్లైన జోఫ్రెడ్, రాల్ఫ్రెడ్  ఇంటినుంచే ఉద్యోగ విధుల్ని నిర్వర్తిస్తున్నారు. అయినా, వారు కరోనా బారిన పడ్డారు. మే 1న వారిని ఆనంద్ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందించారు. వైరస్ నెగెటివ్‌గా తేలడంతో మే 10న ఇంటికి చేరుకున్నారు. మూడురోజుల తరవాత వారిలో ఒకరికి శ్వాససంబంధ సమస్యలు ఎదురయ్యాయి. దాంతో అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయారు. ఆరోగ్యం క్షీణించడంతో గంటల వ్యవధిలోనే మరో సోదరుడు కన్నుమూశారు. చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారుల మరణం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. 

ఏప్రిల్ 23నే వారిద్దరికి 24 ఏళ్లు నిండగా..ఆ మరుసటి రోజే వారు కరోనా బారినపడ్డారు. కొవిడ్ నెగెటివ్ వచ్చినప్పటికీ..వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీయడంతో వారికి నూరేళ్లు నిండాయని ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.  వారి పెద్ద కుమారుడు కూడా ప్రస్తుతం కొవిడ్‌ బారినపడటం ఆ కుటుంబానికి తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది. ఈ మాయదారి మహమ్మారితో ఇంకెన్ని విషాద ఘటనలు చూడాల్సివస్తుందో..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని