ప్రశాంత్‌ మామా.. భయపడుతున్నావా!

తాజా వార్తలు

Updated : 09/06/2021 13:12 IST

ప్రశాంత్‌ మామా.. భయపడుతున్నావా!

వైరల్‌గా మారిన ఫొటో

హైదరాబాద్‌: భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో సినిమాలు తెరకెక్కించి ప్రతి షాట్‌లోనూ ప్రేక్షకుల్ని భయపెట్టే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ఆయన సూది మందుకు భయపడ్డారట. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా తాజాగా ఆయన మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న సమయంలో భయానికి లోనై.. తల కిందకు దించి.. కళ్లు గట్టిగా మూసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి.. ‘ఎట్టకేలకు వ్యాక్సిన్‌ తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే.. వెంటనే మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి’ అని పేర్కొన్నారు.

కాగా, ప్రశాంత్‌ నీల్‌ షేర్‌ చేసిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు.. ‘ప్రశాంత్‌ మామా.. నీ సినిమాల్లో విలన్లు ఎంతో భయంకరంగా ఉంటారు. అలాంటి విలన్లతో పనిచేసిన నువ్వు ఇప్పుడు ఈ చిన్న సూది మందుకు భయపడుతున్నావా?’ అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. మరోవైపు, బాలీవుడ్‌ నటి రవీనాటాండన్‌ సైతం స్పందిస్తూ.. ‘ఇది చాలా క్యూట్‌గా ఉంది ప్రశాంత్‌! ధైర్యం కోసం నువ్వు నా వ్యాక్సిన్‌ వీడియో చూసి ఉండాలి’ అని సరదాగా కామెంట్‌ పెట్టారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన.. ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అలాగే బన్నీ, రామ్‌ చరణ్‌లతో సైతం ప్రశాంత్‌ సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కాకుండా ప్రశాంత్‌నీల్‌-యశ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌-2’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని