close

తాజా వార్తలు

Updated : 28/01/2021 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రకృతిని ప్రేమిస్తే.. సమాజాన్ని ప్రేమించినట్లే!

మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌: ప్రకృతిని ప్రేమించడమంటే సమాజాన్ని ప్రేమించడమే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన అఖిల భారత ఉద్యానవన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ఈవెంట్స్‌ ఆర్గనైజర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో.. 11 రాష్ట్రాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. పిచకారీ యంత్రాలు, పనిముట్లు, సేంద్రియ ఉత్పత్తులు, విత్తన, నర్సరీ, సేంద్రియ ఉత్పత్తులు, ప్రదర్శనకు ఉంచారు. ఈ మేళా ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నారు.

ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు నర్సరీ మేళా కొనసాగనుంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అడవుల పునరుద్ధరణ జరుగుతోందన్నారు. పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టామని, ప్రతి పట్టణంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొక్కలు పెంచడమంటే భవిష్యత్‌ తరాలకు తరగని ఆస్తిని ఇచ్చినట్టేనని అన్నారు. స్థానిక సంస్థల బడ్జెట్‌లో పచ్చదనానికి 10 శాతం నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ మనిషి బాధ్యతనీ, ఆక్సిజన్‌ కొనుక్కునే పరిస్థితి రావొద్దంటే మొక్కలు పెంచాలని హరీశ్‌రావు సూచించారు.

ఇవీ చదవండి

విద్యుత్‌ ఏఈ ఇంట్లో అనిశా సోదాలు
ఏపీ ఎస్‌ఈసీ సెన్సుర్‌ ప్రొసీడింగ్స్‌ తిరస్కరణ

 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని