close

తాజా వార్తలు

Published : 28/02/2021 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుంటూరులో గల్లా జయదేవ్‌ ఎన్నికల ప్రచారం

గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థకు పూర్వవైభవం రావాలంటే కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు.  గుంటూరులోని 3, 8 వార్డుల్లో తెదేపా అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతున్నాయని.. తెదేపా అభ్యర్థులను గెలిపించడం ద్వారా అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. తెదేపా హయాంలో నగరానికి రక్షిత మంచినీరు, భూగర్భ డ్రైనేజీ (యూడీజీ) పథకాలు తెచ్చామని జయదేవ్‌ గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో 50 శాతం యూడీజీ పనులు పూర్తిచేయగా.. వైకాపా ప్రభుత్వం వచ్చాక అవి కొంచెం కూడా ముందుకు సాగలేదని ఆరోపించారు. యూడీజీ పనులు నిలిపేయడంతో ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతోందని జయదేవ్‌ ఆందోళన వ్యక్తం చేశౄరు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని