close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/02/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌ సినిమా కోసం ప్రత్యేక సెట్‌లో...?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక నిర్దేశిత కాలంలో, చారిత్రక నేపథ్యంలో సాగే ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలు కాబోతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పడవ సెట్స్‌లో  చిత్రీకరణ చేయబోతున్నారు. ఇందులో నటించే కథానాయికల ఎంపికపై జరుగుతున్న కసరత్తులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూ వస్తున్నారు పవన్‌కల్యాణ్‌. ఇటీవలే ఆయన ఒకేసారి రెండు చిత్రాల్ని పట్టాలెక్కించారు. వాటిలో ఒకటి ‘పింక్‌’ రీమేక్‌ కాగా, మరొకటి క్రిష్‌ చిత్రం. ఈ రెండు చిత్రాలూ సమాంతరంగా చిత్రీకరణని జరుపుకుంటున్నాయి. వీటితోపాటు హరీష్‌శంకర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు పవన్‌.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.