Coronarelief: భారత్‌కు నికోలస్‌ పూరన్‌ విరాళం
close

తాజా వార్తలు

Published : 01/05/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronarelief: భారత్‌కు నికోలస్‌ పూరన్‌ విరాళం

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ విజృంభిస్తోంది. మునుపెన్నడూ లేనంతంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3.86 లక్షల మంది కొవిడ్ బారిన పడగా..3 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఎంతోమంది బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు కూడా దొరకటం లేదు. ఆక్సిజన్ కొరతతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ ప్రజలకు సాయం చేసేందుకు క్రీడా ప్రపంచం ముందుకువస్తోంది. ఇప్పటికే కమిన్స్‌, బ్రెట్‌ లీ, సచిన్‌ తెందూల్కర్‌ తమవంతుగా విరాళం ప్రకటించారు. దిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు కూడా ఆర్థికసాయం చేయడానికి ముందుకొచ్చాయి. 

తాజాగా ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ తరఫున ఆడుతున్న నికోలస్‌ పూరన్‌ కూడా విరాళం ప్రకటించాడు. కరోనాతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతదేశానికి ఈ సారి తన ఐపీఎల్‌ వేతనంలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా పూరన్‌ ప్రకటించాడు. ఈ మహమ్మారి బారినుంచి భారత్ వీలైనంత తొందరగా బయటపడాలని ఆకాంక్షించాడు.

‘‘ఇప్పటికీ అనేక దేశాలు కరోనాతో పోరాడుతూనే ఉన్నాయి. భారతదేశం పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ భయనకమైన స్థితి నుంచి భారత్ బయటపడటానికి నా వంతు ఆర్థిక సాయం చేస్తా’’ అని పూరన్‌ ట్వీట్‌ చేశాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని