close

తాజా వార్తలు

Published : 02/08/2020 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

గత పది రోజులుగా  దగ్గు, జ్వరం

హైదరాబాద్‌ (పంజాగుట్ట): కరోనా వస్తుందేమోనన్న భయంతో వృద్ధ దంపతులు ఆత్యహత్యకు పాల్పడిన సంఘటన పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పంజాగుట్ట సీఐ నిరంజన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఖైరతాబాద్‌ రాజీనగర్‌లో ఎడమ వెంకటేశ్వరరావు(63),  వెంకటలక్ష్మి(60) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు గత పది రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో వీరు కరోనా ఉందన్న భయంతో మనస్థాపానికి గురై శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకొని  ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి వీరు రాసిన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన