ఎన్నికల కోడ్‌ వల్లే అనుమతి ఇవ్వలేదు
close

తాజా వార్తలు

Updated : 01/03/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్నికల కోడ్‌ వల్లే అనుమతి ఇవ్వలేదు

తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెల్లడి

తిరుపతి: ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వల్ల తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. చిత్తూరు పర్యటనలో భాగంగా ఈ ఉదయం రేణిగుంట చేరుకున్న చంద్రబాబును పోలీసులు విమానాశ్రయంలోనే నిలిపేశారు. పర్యటనకు అనుమతి లేదని చెప్పడంతో చంద్రబాబు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెదేపా నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ మాట్లాడుతూ..

‘ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా తెదేపా నిరసనకు అనుమతి ఇవ్వలేదు. తెదేపా నేతలకు నిన్న రాత్రే నోటీసులు ఇచ్చినా నిరసనకు యత్నించారు. ఇటువంటి కార్యక్రమాలకు ఎన్నికల సంఘం, పోలీసుల అనుమతి తప్పనిసరి. తెదేపా నిరసన తెలపాలనుకున్న ప్రాంతం తిరుపతిలో కీలక ప్రాంతం. ఈ నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు జరగకూడదని అనుమతి ఇవ్వలేదు’ అని ఎస్పీ వివరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని