‘అమరావతి అన్యాయంపై మోదీకి వివరించా’
close

తాజా వార్తలు

Updated : 13/02/2021 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమరావతి అన్యాయంపై మోదీకి వివరించా’

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: రాజధాని అమరావతి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించినట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజధాని అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రధానికి వివరించా. రాజధానిలో ఇప్పటికే రూ.50 వేల కోట్ల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉంది. అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధాని మార్చాలంటే రూ.లక్ష కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. న్యాయపరంగా పోరాడుతున్నాం... మీ మద్దతు కూడా కావాలని ప్రధానిని కోరా. ఆయన సానుకూలంగా స్పందించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ సెంటిమెంట్‌, ఆంధ్రుల మనోభావాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని ప్రధాని అన్నారు. విశాఖ వాసుల సెంటిమెంట్‌ను ప్రధాని కాపాడుతారని నమ్మకం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడులపై 25 పేజీల నోట్‌ను ప్రధానికి అందజేశా. వ్యవసాయ చట్టాలపై కూడా కొన్ని సూచనలు చేశాను. సీఎం జగన్‌ కూడా పార్టీ ఎంపీలతో ప్రధాని మోదీని కలిసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై విజ్ఞప్తి చేయాలి’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.

ఇవీ చదవండి...
కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

రెండో దశలోనూ పోటెత్తిన ఓటర్లు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని