నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 11:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం

బుచ్చిరెడ్డిపాలెం: నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. 

తమిళనాడులోని పెరంబూర్‌కు నుంచి వచ్చిన వీరంతా శ్రీశైలం తదితర ప్రాంతాల్లో ఆధ్యాత్మికయాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి నెల్లూరుకు పయనమయ్యారు. తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపో ముందు భాగం నుజ్జునుజ్జవడంతో నెల్లూరుకు చెందిన డ్రైవర్‌ గుర్నాథ రెడ్డితో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఆరుగురు  అక్కడికక్కడే మృతి చెందారు. నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందారు. 8మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో డ్రైవర్‌తో సహా 15 మంది ఉన్నారు.  సమాచారమందుకున్న సీఐ సురేశ్‌బాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. డ్రైవర్‌ నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. 

మృతులు వీరే..

జగదీష్‌‌, పద్మిని, నందకుమార్‌, రేవతి, దేవి, సుజాత, ఆశ, గుర్నాథ రెడ్డి(టెంపో డ్రైవర్‌)


 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని