close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120021005 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => iM6qpWuUOY4 [video_short_link] => iM6qpWuUOY4 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-13 11:17:27.469394 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

ఫిరోజాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ప్రైవేట్‌ బస్సును లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆగ్రో-లక్నో జాతీయ రహదారిపై 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు దిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.