close

తాజా వార్తలు

Updated : 29/12/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘అమ్మ’తో కాస్త సమయాన్ని వెచ్చించండి: చిరు

హైదరాబాద్: ‘అమ్మతో నాకున్న అనుబంధం అంతా ఇంతా కాదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. నటి సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ఛాట్ షో ‘సామ్‌జామ్’. డిసెంబర్ 25న ‘క్రిస్మస్‌’ కానుకగా విడుదలైన ఈ మెగా ఎపిసోడ్‌లో చిరంజీవి పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ‘మెగా ఎపిసోడ్ అన్‌సీన్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.

ఇందులో ‘‘అన్ని వేళలా అమ్మకు చేదోడువాదోడుగా ఉండేవాడిని. ఎంతో కొంత సమయం వాళ్ల కోసం కేటాయించండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది.. వాళ్లు పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిదని. తిరిగి ఆ సంతోషం మీకు ఎంతో తృప్తినిస్తుంది’’ అని చిరంజీవి చెప్పారు. అంతేకాకుండా ‘మీ గుండె లోతుల్లో నుంచి వచ్చే అభిమానానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను’ అని మెగాస్టార్ అన్నారు. దోశ ఛాలెంజ్‌లో ‘దోశను తిరగేయొచ్చు కానీ, అట్లకాడ పెట్టలేదేంటి’ అని సరదాగా నవ్వులు పూయించారు. ఇలా సాగే ఈ అన్‌సీన్‌ వీడియోను మీరూ చూసేయండి..!

ఇవీ చదవండి..

విజయ్‌ ‘మాస్టర్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌...

కళామతల్లికి కన్నీరు మిగిల్చారు..!
Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని