close

తాజా వార్తలు

Published : 12/07/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోలుకుంటున్నా.. వదంతులు నమ్మొద్దు

హైదరాబాద్‌: ఇటీవల కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, ఆయన ఆరోగ్యంపై వదంతులు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

‘‘నేను బాగానే ఉన్నా. శస్త్రచికిత్స జరిగి 47 రోజులైంది. నా ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోంది. నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను సంతోషంగా ఉన్నా. నా గురించి వస్తున్న వదంతులేవీ నమ్మొద్దు. నా ఆరోగ్యం పట్ల ఎవరికైనా స్పష్టత కావాలంటే నేరుగా నాకే ఫోన్‌ చేయండి’’ అంటూ తన శ్రేయోభిలాషులను ఉద్దేశించి ఆయన ఓ శనివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 

శస్త్ర చికిత్స జరగకముందు నుంచీ సుద్దాల అశోక్‌ తేజ గురించి వదంతులు సోషల్‌మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో నటుడు ఉత్తేజ్‌ ఈ విషయమై స్పష్టతనిచ్చారు. ఆస్పత్రి నుంచి కోలుకుని వచ్చిన తర్వాత సుద్దాల తేజ కూడా ఇది వరకే ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇప్పుడు మరోసారి వదంతులపై స్పందిస్తూ వీడియో విడుదల చేశారు.



 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని