తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ
close

తాజా వార్తలు

Updated : 03/01/2021 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శన టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీని తితిదే ప్రారంభించింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌, తితిదే విష్ణు నివాసం కాంప్లెక్స్‌లలో టోకెన్లను శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులకు అందజేసే ప్రక్రియ మొదలైంది. కాగా, సర్వదర్శన టోకెన్లను తితిదే ముందు రోజు అందుబాటులో ఉంచుతోంది. 

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తితిదే భక్తులకు డిసెంబరు 25 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం ఈ నెల 4వ తేదీ వరకూ జరగనుంది. గతంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించే తితిదే ఈ సారి పది రోజుల పాటు ఈ కార్యక్రమాని చేపట్టింది. తొలుత స్థానికులకే వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు అందజేస్తామని తితిదే ప్రకటించినా క్యూలైన్లలో ఉన్నవారికి సైతం టికెట్లను అందజేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
దర్శన టికెట్లు ఇవ్వాలంటూ భక్తుల ఆందోళన

ఎల్‌హెచ్‌బీ రైలుగా ‘తిరుమల’!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని