
తాజా వార్తలు
తెలంగాణలో నేడు 1,590 మందికి పాజిటివ్
జీహెచ్ఎంసీని బెంబేలెత్తిస్తున్న కేసులు
8 మంది మృతి, 10,904 యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి నానాటికీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1590 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కేసులు సంఖ్య 23,902కు చేరుకుంది. నేడు 1,166 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మొత్తం 10,904 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఏడుగురు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 295కు చేరుకుంది.
ఇక హైదరాబాద్ మహానగరంలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో నేడు 1277 పాజిటివ్‌లు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 125 కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి 19, మహబూబ్ నగర్ 19, నల్గొండ 14 వైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నేడు 5,290 నమూనాలు పరీక్షించగా 3,700 మందికి నెగెటివ్ వచ్చింది.