close

తాజా వార్తలు

Updated : 20/01/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్‌

అమెరికా చరిత్రలోనే వినూత్న పాలనను అందించిన అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం ఇక ముగిసిపోయింది. మరికొన్ని గంటల్లో ఆయన శ్వేతసౌధాన్ని వీడనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు. చివరి ప్రసంగంలోనూ ఎక్కడా ఆయన బైడెన్‌ గెలుపును నేరుగా అంగీకరించలేదు. కేవలం కొత్తగా వచ్చే పాలకవర్గానికి శుభాకాంక్షలు అంటూ సందేశాన్ని ముక్తసరిగా కానిచ్చేశారు. తన హయాంలో సాధించిన విజయాలను కొన్నింటినీ గుర్తుచేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌ రోజుకో వేషంతో మోసం: అచ్చెన్న

రోజుకో వేషంతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులకు సంబంధించి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి ఆలయాలకు శంకుస్థానలు, గోపూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లౌకికవాదమే తెలుగుదేశం మూల సిద్ధాంతమని.. అయితే ఇటీవల కొన్ని వర్గాలు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష

3. గబ్బా హీరోస్‌.. సూపర్‌ మీమ్స్‌

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు‌ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. గబ్బా మైదానం వేదికగా జరిగిన ఆఖరి టెస్టు‌ మ్యాచ్‌ విజయంలో రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కీలక పాత్ర పోషించారు. ఆఖరి టెస్టు‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన యువ ఆటగాళ్లపై నెటిజన్లు తమదైన రీతిలో సరదా మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. మరి అవేంటో మనమూ ఓ లుక్కేద్దామా..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భారత్‌: యాక్టివ్‌ కేసులు.. 2లక్షలకు దిగువన

దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రికవరీలు వేగంగా పెరడగంతో 2లక్షల దిగువకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,97,201 యాక్టివ్‌ కేసులు ఉండగా.. క్రియాశీల రేటు 1.86శాతానికి పడిపోయింది. దేశంలో మొత్తం రికవరీలు.. యాక్టివ్‌ కేసుల మధ్య తేడా కోటికి పైనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 13,823 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే(10,064) ఈ సంఖ్య కాస్త ఎక్కువ కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పెరుగుతున్న ఉత్పరివర్తనల ముప్పు!

5. వలసదారులకు ఊరట! 

అధికార బాధ్యతలు చేపట్టిన తొలిరోజే వలసదారులకు పెద్ద ఊరట కల్పించేలా ఒక బిల్లును అమెరికా నూతనాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించనున్నారు. చట్టబద్ధమైన హోదా లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు 1.10 కోట్ల మందికి ఊరట కలిగించేలా ఈ బిల్లు ఉంటుందని సమాచారం. దీని ప్రకారం ఎనిమిదేళ్లలో వీరంతా చట్టబద్ధ హోదా పొందడానికి వీలుంటుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో వలసదారులపై కఠిన విధానాలను అనుసరించిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బైడెన్‌ వ్యవహరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అప్పుడు ‘మా’యం.. ఇప్పుడు ప్రత్యక్షం

చైనా పాలకుల ఆగ్రహానికి గురై గత కొన్ని నెలలుగా బయటి ప్రపంచానికి కనిపించని ఇ-కామర్స్‌ దిగ్గజం, అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా.. ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. బుధవారం గ్రామీణ ఉపాధ్యాయులతో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో జాక్‌ మా పాల్గొన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ పత్రిక చీఫ్‌ రిపోర్టర్‌ కింగ్‌కింగ్ చెన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ‘‘జాక్‌ మా అదృశ్యమవలేదు. బుధవారం ఉదయం 100 మంది గ్రామీణ టీచర్లతో మా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే బుధవారం ఉదయం విడుదల చేసింది. ఫిబ్రవరి నెల కోటా టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 17 స్లాట్లలో రూ.300 టికెట్లను విడుదల చేసింది. ఒక యూజర్‌ ఐడీ నుంచి ఆరు టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం కల్పిస్తున్న తితిదే.. నెలకొకసారి శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వృద్ధులకు పన్నుపోటు తప్పేనా..!

కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో పింఛను మొత్తాన్ని కూడా ఆదాయపు పన్ను పరిధిలోకి చేర్చింది. దీంతో 60 నుంచి 80 ఏళ్ల మధ్యలోని సీనియర్‌ సిటిజన్ల ఆదాయం 3 లక్షలు దాటితే.. అదే 80 ఏళ్లకు పైబడిన వారి ఆదాయం రూ.5లక్షలు మించితే చట్టప్రకారం పన్ను విధించేవారు. ఆ బడ్జెట్‌ సమయంలో ఆదాయాలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైన సవాలు. ఎందుకంటే అప్పటికే కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం పూర్తిగా కుదురుకోలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అప్పట్లో ఎంతో బాధపడ్డా: విజయ్‌ దేవరకొండ

సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను ఎంతో బాధపడ్డానని టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. కెరీర్‌ ఆరంభంలో ‘నువ్విలా’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన విజయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’తో హీరోగా సెన్సేషనల్‌ అయ్యారు. ఆ సినిమాతో యువతలో క్రేజ్‌ సంపాదించుకుని ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్‌

 కీలక ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేతిలో పరాజయాన్ని చవిచూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌తో పటిష్ఠంగా ఉన్న తమ జట్టు స్వదేశంలో ఓటమిపాలవ్వడం ఎంతో కష్టంగా ఉందని అన్నాడు. గొప్ప పోరాట పటిమ చూపిన భారత ఆటగాళ్లు‌ విజయానికి అర్హులని పేర్కొన్నాడు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా యువ భారత్‌ ఆస్ట్రేలియాను మట్టికరింపిచి బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీని 2-1తో సాధించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని