
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. దిల్లీ అల్లర్లు.. ‘దీప్ సిధు’ పాత్రేంటీ?
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. కిసాన్ పరేడ్‌లో అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చిన కర్షకులు హస్తిన నడిబొడ్డులో ఎర్రకోటను ముట్టడించారు. చారిత్రక కట్టడంపై రైతన్న జెండా ఎగరేశారు. దీంతో అల్లర్లు చెలరేగి దేశ రాజధాని అట్టుడికిపోయింది. అయితే ఇది తమ పనికాదని, విద్రోహ శక్తులు తమ ర్యాలీలో చేరి అల్లర్లు సృష్టించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్!
2. కనీస వేతనం రూ.19 వేలు ఉండాలి..
ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫార్సు చేసింది. అలాగే పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన పీఆర్సీ నివేదికను నేడు ప్రభుత్వం బహిర్గతం చేయనుంది. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. జైలు నుంచి శశికళ విడుదల
అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో ఈమె నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. మరో 10 రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఉన్నతాధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసేందుకు ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ ,అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘ఆచార్య’.. బిగ్ అనౌన్స్మెంట్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఆచార్య’ చిత్రబృందం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజర్‌ను జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ మేరకు టీజర్ విడుదల తేదీని తెలియజేస్తూ బుధవారం ఓ సరికొత్త వీడియోను అభిమానులతో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సమంత
6. మధుమేహమా..ఈ జాగ్రత్తలు తీసుకోండి
7. రూ. 90కి చేరువలో పెట్రోల్ ధర
దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. కొత్త రికార్డుల్లో దూసుకుపోతున్నాయి. దేశ రాజధానిలో బుధవారం పెట్రోల్, డీజిల్‌పై మరో 25పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర అత్యంత గరిష్ఠానికి చేరి రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్ ధర కూడా రూ.76.48కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.90కి చేరువలో ఉంది. బుధవారం 26 పైసలు పెరగడంతో నగరంలో లీటర్ పెట్రోల్ రూ. 89.77గా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో అత్యధికంగా రూ. 92.86కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. భారత్ : 97 శాతానికి చేరిన రికవరీ రేటు..
భారత్‌లో గత 24 గంటల్లో 5,50,426 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,689 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం వెల్లడించిన వివరాలతో పోలిస్తే.. నేడు రోజువారీ కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,06,89,527కి చేరింది. కొత్తగా 13,320 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,03,59,305కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.91 శాతానికి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. మరింత నష్టాల్లోకి జారిన సూచీలు..
దేశీయ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ కూడా 14,100 దిగువన ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సెన్సెక్స్ 557 పాయింట్లు దిగజారి 47,790 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 14,083 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు దేశీయంగా కీలక రంగాల్లో లాభాల స్వీకరణ సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సూచీలు భారీగా నష్టపోతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రూట్.. రైట్ రైట్! కోహ్లీ ఆపగలడా?
అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే క్రికెట్‌పై పట్టు సాధించాడు. మరికొన్నేళ్లకే జట్టుకు నాయకుడిగా ఎదిగాడు. సంప్రదాయ క్రికెటింగ్ షాట్లు ఆడటంలో సిద్ధహస్తుడు. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా తొణకని వీరుడు. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ అన్న తేడా లేకుండా కొన్ని రోజుల ముందే శ్రీలంకపై పరుగుల వరద పారించాడు. ఇప్పుడు టీమ్ఇండియాతో ఢీ అంటున్నాడు. అతడే ఇంగ్లాండ్ సారథి జో రూట్. కోహ్లీసేనతో సమరానికి రైట్.. రైట్ అంటున్న అతడి జోరుకు అడ్డుకట్ట వేసేదెలా? ఉపఖండంలో అతడి పరిస్థితి ఏంటి? పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* వాళ్లను గుర్తించలేకపోయాం: క్రికెట్ ఆస్ట్రేలియా