Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Published : 03/08/2021 13:03 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. CBSE 10th Results: సీబీఎస్‌ఈ పది ఫలితాలు విడుదల 

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.incbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఫలితాలు పొందేందుకు విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Tokyo Olympics: బాధపడి ఏడ్చేంత టైం మాకు లేదు.. దేశానికి కాంస్యమైనా అందించాలి!

 టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్‌లో ఓటమి పాలైనందుకు బాధపడేంత సమయం లేదని భారత హాకీ జట్టు ఆటగాళ్లు అంటున్నారు. గురువారం జరిగే కాంస్య పోరుపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. దేశానికి కనీసం కాంస్య పతకమైనా అందించాలని పట్టుదలతో ఉన్నామన్నారు.  బెల్జియంతో జరిగిన హోరాహోరీ సెమీస్‌లో టీమ్‌ఇండియా 5-2 తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Tokyo Olympics: అయ్యో సోనమ్‌! ఆఖరి 35 సెకన్లు నిలిస్తే..

3. Parliament: సైకిల్‌పై పార్లమెంట్‌కు రాహుల్‌, విపక్ష ఎంపీలు

 దేశంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో విపక్షాలు మంగళవారం ‘సైకిల్‌ ర్యాలీ’ చేపట్టాయి. రాహుల్ సహా ప్రతిపక్ష ఎంపీలు సైకిల్‌ తొక్కుకుంటూ పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చారు. అంతకుముందు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో వీరంతా అల్పాహార విందు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ.. ఇలా 14 ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. సునీల్‌ యాదవ్‌ అరెస్ట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో  కీలక పరిణామం చోటుచేసుకుంది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం సాయంత్రం అరెస్ట్‌ చేసిన అనంతరం మంగళవారం ఉదయం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

JC Prabhakar Reddy: జేసీ సార్‌.. సమావేశం ఏర్పాటు చేస్తాం రండి

5. RRR: ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం

యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు ఆఖరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఈ మేరకు మంగళవారం ఉక్రెయిన్‌ పయనమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం విమాన ప్రయాణ వీడియోను షేర్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Loan Apps: యాప్‌ల నుంచి రుణం తీసుకుంటున్నారా?అవి సురక్షితమైనవేనా?

కరోనా సంక్షోభ సమయంలో వేతన జీవులు సహా.. అనేక మంది సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన వారు.. ఇంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని దుస్థితికి చేరారు. దీంతో చాలా మంది సత్వరమే రుణం అందించే యాప్‌లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రజల్ని మోసం చేసే అనేక నకిలీ యాప్‌లు పుట్టుకొచ్చాయి. పైగా సైబర్‌ నేరగాళ్లు  దీన్ని అదునుగా భావించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో సరైన యాప్‌ను గుర్తించడం ఎలాగో చూద్దాం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ రేట్లను ఇస్తున్న ప్రైవేట్ బ్యాంకులు

7. పడి లేచి గెలిచింది

సాధారణంగా సినిమాల్లో చూసే దృశ్యమిది.. ఒక పరుగు పందెం జరుగుతూ ఉంటుంది.. హీరో ఏదో కారణాలతో పడిపోయి వెనకబడిపోతాడు. కానీ సీన్‌ కట్‌ చేస్తే అతడు లేచి పుంజుకుని అందర్ని దాటుకుంటూ వెళ్లి విజేతగా నిలుస్తాడు. సినిమాల్లో ఇది బాగానే ఉంటుంది కానీ నిజ జీవితంలో కష్టం. అయితే ఒలింపిక్స్‌లో అలాంటి సీన్‌ జరిగింది. నెదర్లాండ్స్‌ అమ్మాయి సిఫాన్‌ హసన్‌ ఈ అద్భుతాన్ని చేసింది. 1500 మీటర్ల పరుగు హీట్స్‌లో మొదట తడబడి పడిపోయిన సిఫాన్‌.. మళ్లీ లేచి పరుగు ప్రారంభించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Corona: ఒక్కసారిగా తగ్గిన కొత్త కేసులు.. ఎన్నంటే..?

గత కొద్ది రోజులుగా 40వేలకు పైగానే నమోదవుతోన్న కొత్త కేసులు ఒక్కసారిగా తగ్గాయి. ముందురోజు కంటే 24 శాతం క్షీణించి..30 వేలకు చేరాయి. మృతుల సంఖ్యలో మాత్రం మార్పులేదు. అంతకుముందురోజు మాదిరిగానే 400పైగా మరణాలు వెలుగుచూశాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 30,549 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Booster Dose: బూస్టర్‌ డోసుతో కొత్త వేరియంట్లకు అడ్డుకట్ట

9. Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ కూలిపోయింది. రంజిత్‌ సాగర్‌ డ్యాం సమీపంలో ఆర్మీ ఏవియేషన్‌ ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తూ అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ నిమిత్తం పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ నుంచి బయల్దేరిన ఈ విమానం కథువా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అయితే సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Stock Market: చరిత్ర సృష్టించిన నిఫ్టీ.. 16,000 మైలురాయిని తాకిన సూచీ!

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు ఈరోజు జోరుమీదున్నాయి.  జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ) సూచీ ఎన్‌ఎస్‌ఈ కీలక 16 వేల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించగా.. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) సైతం గరిష్ఠాల వద్ద పయనిస్తోంది. మహమ్మారి వల్ల కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందనే సంకేతాలు, తయారీ కార్యకలాపాలు మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు 33 శాతం పుంజుకోవడం వంటి సానుకూల సంకేతాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని