close

తాజా వార్తలు

Published : 08/03/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా పోలవరం పూర్తి

పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కి పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెదేపా  ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కటారియా రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్‌ మేరకు వివరాలు ఇస్తున్నామని తెలిపారు. ఏయే పనులు ఎప్పటికి పూర్తవుతాయో వివరించారు. మే నాటికి స్పిల్‌వే పనులు, ఏప్రిల్‌ నాటికి క్రస్టు గేట్ల పనులు పూర్తవుతాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రామాయపట్నం పోర్టుకు సాయం చేయలేం: కేంద్రం

2. తెరాస ఏడేళ్ల పాలనలో డీఎస్సీ ఏదీ?: ఉత్తమ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస దిగజారి ప్రవర్తిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఓటర్లను బెదిరించి తెరాసకు ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వీడియోలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈసీ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిలువు నీడలేని హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే

మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ప్రజల కోసం పనిచేశారు.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్లారు.. కానీ, ప్రస్తుతం ఉండడానికి ఇల్లు కూడా లేక కుమార్తె ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరతరాలు కూర్చొని తినేలా డబ్బు పోగేస్తున్న నేటి కాలంలో ఆయనొక అరుదైన నేత. ఆయనే భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రొడక్షన్‌.. డైరెక్షన్‌.. యాక్షన్‌.. అన్నింటా వీళ్లే..!

అమ్మగా.. గృహిణిగా.. కుమార్తెగా ఇలా మహిళలు కేవలం ఇంటి బాధ్యతలకే కాకుండా ఉద్యోగినిగా ఎన్నో రంగాల్లో కీలక పాత్రను పోషిస్తున్నారు. పేరు, ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. ఇక, సినీపరిశ్రమ విషయానికొస్తే తెరపైన నటీమణులుగా రాణిస్తున్న ఎంతో మంది మహిళలను మనం చూస్తున్నాం. వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే, కేవలం తెరపై నటిగానే కాకుండా తెర వెనుక వివిధ విభాగాల్లోనూ నారీమణులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దర్శకత్వం, నిర్మాణ, సంగీతం.. ఇలా పలు విభాగాల్లో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నారీశక్తి గురించి తెలుసుకుందాం..! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* చరిత్ర సృష్టించగలరు.. భవిష్యత్‌ నిర్మించగలరు

5. టీకా తీసుకున్న ప్రథమ మహిళ

దేశ ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ సతీమణి సవితా కోవింద్‌ నేడు కరోనా టీకా తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆమె వ్యాక్సిన్‌ చేయించుకోవడం విశేషం. దిల్లీలోని ఆర్‌ అండ్‌ ఆర్‌ ఆర్మీ ఆసుపత్రిలో ఆమె కొవిడ్‌టీకా‌ తొలి డోసు తీసుకున్నారు. ఆమె వెంట కుమార్తె స్వాతి ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 86శాతం కేసులు ఆరు రాష్ట్రాల నుంచే..!

6. లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పు

లోక్‌సభ సమావేశాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రేపట్నుంచి (మంగళవారం) ఉదయం 11గంటలకే సభ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారికి ముందు జరిగినట్టుగానే పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలూ ఏకకాలంలో ప్రారంభం కానున్నాయి. సమావేశాల వేళల్లో మార్పులు చేయాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు కోరడంతో రాజ్యసభ ఛైర్మన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంపీ వందనా చవాన్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మార్కెట్లలో ఒడుదొడుకులు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి స్వల్పంగా కోలుకొని లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం 50,654 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 50,985 వద్ద గరిష్ఠాన్ని.. 50,318 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 35 పాయింట్లు లాభపడి 50,441 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15,002 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. రోజులో 15,111 - 14,919 మధ్య కదలాడి చివరకు 18 పాయింట్ల స్వల్పలాభంతో 14,956 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ₹72లక్షల మద్యం దుకాణం ₹510 కోట్లు పలికింది!

రాజస్థాన్‌లో ఓ మద్యం దుకాణం ఎవరూ ఊహించనంత ధర పలికింది. కేవలం రూ.లక్షలు విలువ చేసే ఈ దుకాణాన్ని వేలంలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు రూ.510కోట్లకు సొంతం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు వేలకుపైగా మద్యం దుకాణాలను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో వేలంపాట నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హనుమన్‌ఘఢ్‌ జిల్లాలోని నోహార్‌ నగరంలో ఉన్న ఒక మద్యం దుకాణానికి ఎక్సైజ్‌ శాఖ రూ.72 లక్షలు బేస్‌ ధరగా నిర్ణయించి వేలం మొదలుపెట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మహిళా రైతుల ఆందోళన..హైవేల మూసివేత!

దేశ రాజధానిలో చేపట్టిన రైతు ఉద్యమం మరోసారి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఆందోళనలు వంద రోజులు పూర్తిచేసుకోగా.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో మహిళలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన మహిళా రైతులు, టిక్రీ, ఘజీపూర్‌ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్నారు. మహిళా రైతులకు పంజాబ్‌ నటి సోనియా మాన్‌ మద్దతు తెలిపారు. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చే జాతీయ రహదారులను మూసివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆఖరి 30 సెకన్లలో స్వర్ణం కొట్టేశాడు..

భారత కుస్తీవీరుడు బజరంగ్‌ పునియా 65కిలోల విభాగంలో తిరిగి ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. మాటియో పెలికొన్‌ ర్యాంకింగ్‌ సిరీసు పోటీల్లో స్వర్ణ పతకం ముద్దాడాడు. ఫైనల్లో మంగోలియా ఆటగాడు తుల్గా తుమర్‌ ఒచిర్‌ను ఓడించాడు. తొలుత ప్రత్యర్థి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో చివరి వరకు పోరాడిన బజరంగ్‌ ఆఖరి 30 సెకన్లలో 2 పాయింట్లు సాధించి స్కోరు సమం చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని