close

తాజా వార్తలు

Updated : 14/01/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ట్రంప్‌ అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం

వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవినుంచి దిగిపోనున్న ట్రంప్‌ మరో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. క్యాపిటల్‌ హిల్‌ దాడి ఘటనను ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య చరిత్రలో రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్‌ అపఖ్యాతి పాలయ్యారు. అభిశంసన తీర్మానంపై సెనెట్‌లో తదుపరి చర్చ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పాస్‌వర్డ్‌ మర్చిపోవడంతో రూ.1,800 కోట్లు గల్లంతు!

ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్‌లను మరిచిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే. అయితే దీనివల్ల ఓ వ్యక్తికి ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది! జర్మనీకి చెందిన స్టీఫెన్‌ థామస్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రోగ్రామర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 2011లో 7,002 బిట్‌ కాయిన్ల(ఓ రకమైన డిజిటల్‌ కరెన్సీ)ని కొనుగోలు చేశారు. ఇప్పుడు దాని విలువ రూ.1,800 కోట్లకు పైగా(245 మిలియన్‌ డాలర్లు) పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవారు... వేటకు వచ్చారు!

వేట ప్రభువుల బాధ్యత. క్రూర మృగాలను అంతమొందించి రాజ్యానికి ప్రశాంతతను చేకూర్చడం వారి కర్తవ్యం... జగదేక ప్రభువైన శ్రీనివాసుడికీ అంతే. అలా ఆయన వేటకు వచ్చే సందర్భమే పార్వేట లేదా పారువేట. ఈ ఉత్సవాన్ని ఏటా మకర సంక్రాంతి మరునాడు అంటే కనుమ రోజు నిర్వహిస్తారు. వేంకటేశ్వర స్వామి పంచాయుధాలైన శంఖు, చక్ర, గద, విల్లు, ఖడ్గం  ధరించి అడవులకు వెళ్లి క్రూర మృగాలను వేటాడి  విజయుడై తిరిగి ఆలయానికి చేరుకునే సందర్భమిది. దీన్ని ఎలా నిర్వహిస్తారంటే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సంస్కృతి సంతకం... సంక్రాంతి!

4. టీఎస్‌-బీపాస్‌లో మరిన్ని సేవలు!

దేశంలోనే వినూత్నంగా తెలంగాణలో అమలు చేస్తున్న టీఎస్‌-బీపాస్‌లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం టీఎస్‌-బీపాస్‌ విధానంలో 600 చదరపు గజాల్లోపు నివాసాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది. రెండు నెలలక్రితం రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ 4,000కు పైగా అనుమతులు జారీ అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బుక్‌ చేసుకున్న 2 గంటల్లో సిలిండర్‌

ఇక సామాన్యులకు వంట గ్యాస్‌ సిలిండరు కష్టాలు తీరనున్నాయి. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండరు ఇంటికి చేరనుంది. ఒకే గ్యాస్‌ సిలిండర్‌ ఉండి, తత్కాల్‌ ప్రాతిపదికన బుక్‌ చేసుకున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించాలని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నిర్ణయించింది. ‘సులభతర జీవనం’ విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అమలు చేయనుంది. ఈ నెల 16న ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మళ్లీ మూలాల్లోకి!

గాడిపొయ్యి మీద ఇత్తడి కళాయి పెట్టి, అందులో దంపుడు బియ్యంతో అన్నం వండి వడ్డిస్తే... గానుగ నూనెలో వేయించిన గారెలు తింటే... మట్టి ముంతల్లో పాలు కాచి తాగుతుంటే.. ఆహా... అద్భుతః ఎప్పుడో 40-50 ఏళ్ల నాటి ఈ సంప్రదాయాలన్నీ ఇప్పుడు మళ్లీ మన మనసులను దోచుకుంటున్నాయి. ఇదంతా పాత మీద మోజు కాదు. పల్లెల్లో, పట్టణాల్లో కూడా ఇప్పుడు.. పాత అలవాట్లలోని మంచిని ఎంచుకుని, ఆధునిక జీవనశైలిగా మార్చుకునే ధోరణి పెరుగుతుండటం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రకృతితో కొత్తబాటలు...

7. భార్గవరామ్‌ మహారాష్ట్రకు.. శ్రీను కర్ణాటకకు

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ ఉదంతంలో సూత్రధారులైన భార్గవరామ్‌, గుంటూరు శ్రీనులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న హైదరాబాద్‌ పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. భార్గవరామ్‌ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్లు కచ్చితమైన సమాచారం లభించడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లాయి. ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్‌ చేయించిన వీరిద్దరూ మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మూగ బాలికపై సామూహిక అత్యాచారం

తోటి పిల్లలతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లిన ఆ చిన్నారి (15)పై ముగ్గురు మృగాళ్లు కనికరం లేకుండా దాడి చేశారు. చెవిటి, మూగ అయిన ఆ బాలికను అంధురాలిగా కూడా మార్చేస్తే.. తమ పైశాచికత్వానికి ఇక సాక్ష్యాధారాలు ఉండవని రాక్షసంగా ప్రవర్తించారు. బిహార్‌ రాష్ట్రం మధుబని జిల్లా హర్‌లాఖి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కవాహ బర్హి గ్రామంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులు ఓ పదునైన వస్తువుతో ఆమె కళ్లను తీవ్రంగా గాయపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. టీజర్ల ముగ్గులు.. పోస్టర్ల తోరణాలు

టీజర్లు... భోగిమంటల్లా వెలిగాయి.  పోస్టర్లు... వాకిట్లో తోరణాల్లా మెరిశాయి. ట్రైలర్లు... ముగ్గులతో మెరుస్తున్న మన లోగిళ్లలా కళకళలాడాయి. కొత్త సంభాషణలు, కొత్త విడుదల తేదీలు... కొత్త నేపథ్యాలు, కొత్త కథలు... మకర సంక్రాంతికి... సినిమా కాంతి తోడైంది. తెలుగు ప్రేక్షకులకు పండగ ఆనందం రెట్టింపైంది. మనకే కాదు... మన సినిమాకి పెద్ద పండగ సంక్రాంతి. ఒక పక్క కొత్త చిత్రాలు వరుస కడుతుంటే... మరోపక్క సెట్స్‌పై ఉన్న సినిమాలు ప్రచారంతో సందడి చేస్తుంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆఖరి పోరాటం

జట్టు నిండా గాయాలే. 11 మంది ఫిట్‌గా ఉన్న వాళ్లను సిద్ధం చేయడమే కష్టం ఉంది. దానికి తోడు క్వారంటైన్‌ కష్టాలు. ఆపై ఆడాల్సింది ఆస్ట్రేలియాకు అద్బుత రికార్డున్న గబ్బాలో. ఇన్ని ప్రతికూలాంశాలున్నా.. టీమ్‌ ఇండియా ఆత్మవిశ్వాసంతో ఉంది. క్లిష్టపరిస్థితుల్లో సిడ్నీలో అసాధారణ పోరాటంతో చేసుకున్న డ్రా స్ఫూర్తినిస్తుంటే.. ఆతిథ్య జట్టుతో నిర్ణయాత్మక నాలుగో టెస్టుకు సన్నద్ధమైంది. రేపటి నుంచే సమరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని