close

తాజా వార్తలు

Published : 02/03/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. ఆ మూడు అంశాల్లో మార్పు కనిపించాలి: జగన్‌

కార్పొరేట్‌ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు ఉండాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అనే మాటే వినిపించకూడదని.. ఎంత మంది అవసరమైతే వారందరినీ నియమించుకోవాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇంటి అద్దెల వృద్ధిలో హైటెక్‌సిటీ టాప్‌

దేశంలోని ప్రధానమైన ఏడు నగరాల్లో విలాసవంతమైన ప్రాంతాల ఇంటి అద్దెల వృద్ధిలో హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ మొదటిస్థానంలో ఉంది. 2014-20 మధ్య దేశవ్యాప్తంగా ఈ నగరాల్లో అద్దెల వృద్ధి 12 శాతం ఉండగా, హైటెక్‌సిటీలో అద్దెలు 26 శాతం వృద్ధి కనబరిచినట్లు అనరాక్‌ నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాలకు సంబంధించిన లగ్జరీ ప్రాంతాల అద్దె, ఇంటి విలువ పెరుగుదల నివేదికను అనరాక్‌ విడుదల చేసింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్‌లో 15 శాతం అద్దెలు పెరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ‘తెరాస ప్రభుత్వ వైఖరి వల్లే ఐటీఐఆర్‌ రాలేదు’

తెలంగాణలో ఐటీఐఆర్‌ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టు రాలేదని కాగ్‌ నివేదికలో స్పష్టంగా వెల్లడైందన్నారు. ఐటీఐఆర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. పాలనాపరమైన అడుగులు ముందుకు వేయని మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. బెంగాల్‌లో 20.. అసోంలో 6 ర్యాలీలకు మోదీ! 

దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. కీలక నేతలంతా ప్రచార ర్యాలీల్లో పాల్గొని తమ ప్రసంగాలతో రాజకీయాలను  హీటెక్కిస్తున్నారు. తద్వారా ఓటర్లను తమ వైపు ఆకర్షించి అధికార పీఠం దిశగా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభలకు మార్చి/ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* అసోంలో కాంగ్రెస్‌ హామీల వెల్లువ

5. రవాణా ఛార్జీలు 25శాతం పెరగవచ్చు..!

అసలే ఇంధన ధరలు మండిపోతుండటంతో అవస్థలు పడుతున్న సామాన్యూడిపై మరోపిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్‌ ధరల కారణంగా రవాణా ఛార్జీలు 25శాతం వరకు పెరగవచ్చని ఆల్‌ఇండియా ట్రాన్స్‌పోర్టు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ ప్రదీప్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. గతేడాది నుంచి డీజిల్‌ ధరలు దాదాపు 35శాతం వరకు పెరిగాయి. దీంతో ఫుల్‌ ట్రక్‌లోడ్‌ డీల్స్‌ రవాణా ఛార్జీలు 25-30శాతం వరకు పెరిగేందుకు కారణం కావొచ్చని ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఈ సినిమా టీజర్‌ విడుదల విషయమై సినీ వర్గాల్లో చర్చసాగుతోంది. అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న పుష్ప టీజర్‌ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ 8న సినిమా టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ విడుదల చేసి సర్‌ప్రైజ్‌ చేసింది చిత్రబృందం. దీంతో ఈసారి టీజర్‌ ట్రీట్‌ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా

హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతంలో ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఆ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల్లో వారికి కరోనా పాజిటివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టి ఆయా విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు జరపగా.. 54 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో పాఠశాల వసతిగృహాన్ని మూసివేసిన అధికారులు.. ఈ ప్రాంతాన్ని కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 15 నిమిషాల్లో ఫుల్‌ఛార్జ్‌ అయ్యే బ్యాటరీ

ప్రస్తుతం పెట్రోలు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో మరోసారి ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగంపై చర్చ నడుస్తోంది. అయితే, వీటికి ఉన్న ప్రధాన సమస్యల్లో బ్యాటరీ ఛార్జింగ్‌ ఒకటి. ఎక్కువ సేపు ఛార్జ్‌ చేయాల్సి రావటంతో వాహనాదారులు ఇప్పటికీ వీటిపై ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘లాగ్‌-9’ 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అయ్యే టెక్నాలజీని సిద్ధం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఒంటరితనం వల్లే ఇంటర్నెట్‌ అతి వినియోగం!

ఇంటర్నెట్‌ వినియోగం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ వాడుతున్నారు. కానీ, ఇంటర్నెట్‌ అతి వినియోగం చాలా ప్రమాదకరమని, ఆరోగ్య సమస్యలతోపాటు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే, ఒంటరితనాన్ని అనుభవించే కౌమరదశ పిల్లలకు ఇంటర్నెట్‌ వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని ఓ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇంగ్లాండ్‌లోనూ రెండు రోజుల్లో ముగుస్తాయి 

ఇంగ్లాండ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయని, అందులో ఆశ్చర్యమేమీ లేదని ఆ జట్టు పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ స్పష్టం చేశాడు. తాజాగా అతడు ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తైన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ఇంగ్లాండ్‌ మాజీలు ఆ పిచ్‌పై విమర్శలు చేశారు. అది టెస్టు క్రికెట్‌కు సరైన పిచ్‌ కాదని అన్నారు. ఈ క్రమంలోనే ఆర్చర్‌ ఇలా స్పందించడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని