ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి నామినేషన్‌
close

తాజా వార్తలు

Updated : 22/02/2021 14:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవి నామినేషన్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పీవీ ఘాట్‌కు వెళ్లిన ఆమె.. మంత్రి తలసాని, కె.కేశవరావుతో కలిసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని వాణీదేవి అన్నారు. అక్కడి నుంచి వారు ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆమెకు బీఫామ్‌ అందజేశారు. 

వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ కోరారు. పీవీకి సరైన గౌరవం దక్కాలంటే వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఇప్పటికే నల్గొండ- వరంగల్‌- ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రకటించిన తెరాస.. బీఫామ్‌ అందజేసిన విషయం తెలిసిందే. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని