close

తాజా వార్తలు

Published : 17/06/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో జీతాల కోతపై ఆర్డినెన్స్‌

హైదరాబాద్‌: విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈమేరకు గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

తెలంగాణ విపత్తులు, ప్రజారోగ్య అత్యయిక ఆర్డినెన్స్‌ 2020కి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 24 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో గరిష్ఠంగా 50శాతం కోత విధించేలా ఆర్డినెన్స్‌ రూపొందించింది. కోత విధించిన మొత్తాన్ని ఆర్నెల్లలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని పేర్కొంది. పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. పింఛన్లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని