రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 17/03/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరి ఆత్మహత్య

రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని బస్టాండు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలోని వేర్వేరు గదుల్లో వెంకట్‌ గౌడ్‌ (35), అనిత (31) బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంకట్‌ గౌడ్‌ పురుగుల మందు తాగి చనిపోగా.. అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రెండు రోజుల క్రితం లాడ్జిలో వేర్వేరు గదులు తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంజూయాదవ్‌ తెలిపారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకట్‌ గౌడ్‌‌.. 15 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన అనిత కూడా ఇదే వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. మృతులిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లుగా వెంకట్‌ గౌడ్‌ కుటుంబసభ్యులు తెలిపినట్లు సీఐ తెలిపారు. అయితే, వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని సీఐ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని