యూపీలో బలవంతపు మతమార్పిడి ఇక నేరమే!
close

తాజా వార్తలు

Updated : 28/11/2020 16:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో బలవంతపు మతమార్పిడి ఇక నేరమే!

లఖ్‌నవూ: బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా యూపీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆమోదించారు. ‘యూపీ చట్టవిరుద్ధ మత మార్పిడుల బిల్లు 2020’కి గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ శనివారం ఆమోదం తెలిపారు. ఇవాళ్టి నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై ఎవరైనా వివాహం పేరుతో చట్టవిరుద్ధంగా బలవంతపు మత మార్పిడికి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అంతేకాకుండా రూ.50వేలు జరిమానా విధిస్తారు.

యూపీ చట్ట వ్యతిరేక మతమార్పిడుల బిల్లు-2020కి ఇటీవల రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. వివాహం కోసం ఎవరైనా మతం మారాలనుకుంటే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. బలవంతంగా, మోసపూరితంగా మత మార్పిడి చేయడం లేదని నిరూపించాల్సిన బాధ్యత వివాహం చేసుకునే వ్యక్తులపై ఉంటుంది. కాగా, గత కొన్ని వారాలుగా భాజపా పాలిత రాష్ట్రాలైన యూపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాల్ని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని