చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలు శిక్ష
close

తాజా వార్తలు

Published : 06/03/2021 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేయని నేరానికి 20 ఏళ్లుగా జైలు శిక్ష

బందీఖానాలోనే ఒళ్లు హూనమైందన్న బాధితుడు

లఖ్‌నవూ: చేయని నేరానికి ఓ వ్యక్తి ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తాను నేరం చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా అతడిని సమాజం, పోలీసులు నమ్మలేదు. దాదాపు 20 ఏళ్లపాటు జరిగిన విచారణలో నిర్దోషిగా తేలడంతో బందీఖానాలో మగ్గుతున్న అతడి జీవితం కొత్త ఊపిరి పోసుకుంది. 23 ఏళ్ల వయసులో జైలులో అడుగుపెట్టిన ఆ వ్యక్తి 43 ఏళ్ల వయసులో నిరపరాధిగా విడుదలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్‌కు చెందిన విష్ణు తివారిని అత్యాచారం కేసులో 2000 సెప్టెంబర్‌ 1న పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ సందర్భంగా మూడేళ్లపాటు జైల్లోనే గడిపాడు. కేసు విచారించిన ట్రయల్‌ కోర్టు అతడిని దోషిగా తేలుస్తూ జైలు శిక్ష వేసింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది.

ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ విష్ణు హైకోర్టుకు వెళ్లాడు. ఇలా కోర్టు విచారణ పూర్తయ్యే సరికి ఏళ్లు గడిచాయి. చివరికి గత నెల 28వ తేదీన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తివారిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో రెండు దశాబ్దాలపాటు జైలులో మగ్గిన ఆయన బుధవారం విడుదలయ్యారు. ఎవరో చేసిన పాపానికి కుంటుంబాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయానని విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. జైల్లో ఒళ్లు హూనమైపోయిందన్న అతడు.. ఇన్నాళ్ల తర్వాత బయటకు వచ్చిన్నా ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందారు. ఓ సోదరుడు మినహా తనకంటూ ఎవరూ లేకుండా పోయారని పేర్కొన్నారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత విష్ణు తివారి నిర్దోషిగా బయటకు రావడంతో ఆయన స్వగ్రామం లలిత్‌పుర్‌ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల తర్వాత గ్రామానికి వచ్చిన తివారిని అప్యాయంగా పలకరిస్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని