
దిల్లీలో వెలికితీసిన ఐటీ అధికారులు దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో రూ.20 వేల కోట్ల విలువైన హవాలా, మనీలాండరింగ్ రాకెట్ వెలుగు చూసింది. పాత దిల్లీ పరిధిలోని పలు వాణిజ్య ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా వరసపెట్టి చేసిన సోదాలు, సర్వేల ద్వారా మూడు గ్రూపులకు చెందిన ఆపరేటర్ల అక్రమ ఆర్థిక కార్యకలాపాల్ని వెలికితీసినట్లు ఆదాయపు పన్ను విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నయాబజార్ ప్రాంతంలో చేపట్టిన సోదాల్లో రూ.18 వేల కోట్ల విలువైన దొంగ బిల్లులను గుర్తించారు. సదరు గ్రూపు నకిలీ బిల్లుల కోసం డజనుదాకా దొంగ సంస్థల్ని నెలకొల్పినట్లు వెల్లడించారు. రెండోకేసులో.. అత్యంత వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న మనీలాండరింగ్ రాకెట్‌ను వెలికితీశామని, ఈ వ్యవహారంలో అక్రమరీతిలో దీర్ఘకాలిక క్యాపిటల్గెయిన్స్ను పొందినట్లు తెలిపారు. ఇందులో రూ.1000 కోట్ల మేర కుంభకోణం జరిగి ఉంటుందని, ఈ అంకెలన్నీ పైకి కనిపిస్తున్నవేనని, ఈ వ్యవహారం చాలా ఏళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మరో వ్యవహారంలో ఓ గ్రూపునకు సంబంధించి జరిపిన సోదాల్లో గుర్తుతెలియని విదేశీ బ్యాంకు ఖాతాల్ని, ఎగుమతుల ఇన్వాయిస్ల ద్వారా దొంగ సుంకాల్ని/జీఎస్టీని క్లెయిమ్ చేసుకునే రాకెట్‌ను గుర్తించామన్నారు. సదరు దొంగ ఎగుమతుల విలువ సుమారు రూ.1500 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సోదాల్లో భాగంగా సుమారు రూ.వంద కోట్లదాకా విలువైన వ్యవహారాలకు సంబంధించిన పత్రాలను జప్తు చేసినట్లు, ఇతరత్రా ఆధారాల్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటన్నింటికి సంబంధించి మొత్తంగా సుమారు రూ.20 వేల కోట్లదాకా పన్ను ఎగవేశారని గుర్తించినట్లు ఐటీ అధికారి వెల్లడించారు.
ముఖ్యాంశాలు

దేవతార్చన
- పది కిలోమీటర్ల దూరంలో ఇల్లు తీసుకుని..
- తండ్రి కారు కింద చితికిపోయిన చిన్నారి
- ‘రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారు..చంపేయండి’
- కన్నబిడ్డ వివాహమైన కాసేపటికే
- ఉగ్రదాడిని ఖండిస్తూనే.. చైనా వక్రబుద్ధి
- మేడమ్.. నా పిల్లలకు తల్లి ఉంది
- 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారు
- ప్రేమ వ్యవహారమే కారణమా?
- ఆస్ట్రేలియా సిరీస్‌కు కేఎల్ రాహుల్
- పుల్వామా దాడి గురించి ముందే హెచ్చరించారా?