Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134521
            [news_title_telugu_html] => 

ప్రతిభకే ప్రవేశం 

[news_title_telugu] => ప్రతిభకే ప్రవేశం  [news_title_english] => [news_short_description] => నిర్మల్‌ జిల్లా బాసరలో ఉన్న తెలంగాణ గ్రామీణ విద్యార్థుల కలల సాంకేతిక విద్యాలయం ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
ప్రతిభకే ప్రవేశం  - EENADU
close
ప్రతిభకే ప్రవేశం 

బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా విడుదల 
అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లాకు 259 సీట్లు 
అత్యల్పంగా జోగులాంబ గద్వాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు 2 సీట్ల చొప్పున

బాసర, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా బాసరలో ఉన్న తెలంగాణ గ్రామీణ విద్యార్థుల కలల సాంకేతిక విద్యాలయం ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌) 2019-20 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల జాబితాను శనివారం విడుదల చేసింది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ప్రవేశానికి గత ఏప్రిల్‌ నెలలో దరఖాస్తులను ఆహ్వానించగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. విద్యాలయ చరిత్రలో తొలిసారిగా 1500 సీట్లకు 35,763 దరఖాస్తులు వచ్చాయి. పదో తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచి సీటు పొందిన 1,404 మంది విద్యార్థుల జాబితాను శనివారం విద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఇన్‌ఛార్జి ఉపకులపతి డా.అశోక్‌ విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను విద్యాలయ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ.బాసర.ఇన్‌లో పొందుపరిచారు. వ్యక్తిగతంగా విద్యార్థులకు సమాచారం అందించారు. 99 శాతం సీట్లను ప్రభుత్వ విద్యార్థులే సాధించారు. ప్రైవేట్‌లో చదివిన 12 మందికి మాత్రమే విద్యాలయంలో సీట్లు లభించాయి. వెనుకబాటు సూచీ ఆధారంగా 0.4 జీపీఏను అదనంగా కలపటం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారింది. ప్రైవేట్‌లో చదివిన చాలా మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ సాధించినా సీటు లభించలేదు. కేటగిరీలవారీగా చూస్తే జనరల్‌లో 10.2 కన్నా ఎక్కువ జీపీఏ కలిగిన వారికే సీట్లు లభించాయి. బీసీ-ఏ 10.2, బీసీ-బీ 10.2, బీసీ-సీ 10, బీసీ-డీ 10.2, బీసీ-ఈ 10.1, ఎస్సీ 10.1, ఎస్టీ కేటగిరీలో 10.1 జీపీఏ కటాఫ్‌గా ఉంది. 
నిజామాబాద్‌ జిల్లాకు అగ్రస్థానం 
విద్యాలయం ఎంపిక చేసిన ప్రవేశాల జాబితాలో నిజామాబాద్‌ జిల్లా అత్యధికంగా 259 సీట్లు సాధించింది. తర్వాత స్థానాల్లో జగిత్యాల 176, సిద్దిపేట 154, నల్గొండ 112, కరీంనగర్‌ 93, మెదక్‌ 51, కామారెడ్డి 50, రంగారెడ్డి 50, జనగామ 49, రాజన్న సిరిసిల్ల 44, పెద్దపల్లి 38, సంగారెడ్డి 37, యాదాద్రి భువనగిరి 33, వరంగల్‌ పట్టణ 27, వరంగల్‌ గ్రామీణ 26, ఖమ్మం 25, మంచిర్యాల 23, సూర్యాపేట 23, మహబూబాబాద్‌ 21, మేడ్చల్‌ మల్కాజిగిరి 18, ఆదిలాబాద్‌ 14, నాగర్‌కర్నూల్‌ 14, జయశంకర్‌ భూపాలపల్లి 12, మహబూబ్‌నగర్‌ 8, వికారాబాద్‌ 6, నిర్మల్‌ 5, భద్రాద్రి కొత్తగూడెం 4, వనపర్తి 4, హైదరాబాద్‌ జిల్లా 3 సీట్లు సాధించాయి. అత్యల్పంగా జోగులాంబ గద్వాల, కుమురంభీం జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున మాత్రమే సీట్లు సాధించారు. 21 సీట్లను అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు కేటాయించారు. 
25, 26 తేదీల్లో కౌన్సెలింగ్‌ 
ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. జూన్‌ 25వ తేదీన క్రమసంఖ్య 1 నుంచి 800 వరకు ఉన్న విద్యార్థులు, 26న 801 నుంచి 1404 సంఖ వరకు ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జి ఉపకులపతి తెలిపారు. మిగతా 96 సీట్లను ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, సైనిక విద్యార్థులు, దివ్యాంగులతో భర్తీచేస్తారు. వీరికి జులై 3న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన అనంతరం ఎవరైనా విద్యాలయంలో చేరకపోతే వారి స్థానంలో ఆయా ఖాళీలకు మరో జాబితాను ప్రకటిస్తారు. జులై 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.