Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114321
            [news_title_telugu_html] => 

‘ఇమ్రాన్‌ సాబ్‌.. మీకో దండం’

[news_title_telugu] => ‘ఇమ్రాన్‌ సాబ్‌.. మీకో దండం’ [news_title_english] => Imran Khan quotes Rabindranath Tagore says it is by Kahlil Gibran [news_short_description] => పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కి నెటిజన్లు చురకలంటిస్తున్నారు.   [news_tags_keywords] => Imran Khan,pakistan,twitter [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 01:07:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఇమ్రాన్‌ సాబ్‌.. మీకో దండం’ - Imran Khan quotes Rabindranath Tagore says it is by Kahlil Gibran - EENADU
close

తాజా వార్తలు

‘ఇమ్రాన్‌ సాబ్‌.. మీకో దండం’

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కి నెటిజన్లు చురకలంటిస్తున్నారు. ఎందుకంటే బుధవారం తన ట్విటర్‌ ఖాతాలో ఓ సూక్తిని పోస్ట్ చేసి, దాన్ని రాసింది కవి ఖలీల్‌ జిబ్రాన్‌ అని ఆయన పేర్కొన్నారు. అయితే, నిజానికి ఆ వాక్యాన్ని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ రాశారు. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు ఇమ్రాన్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘‘జిబ్రాన్‌ చెప్పిన ఈ వాక్యాల్లోని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారు చాలా సంతృప్తితో ఆనందంగా జీవిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘జీవితమంతా సంతోషభరితమని.. నేను నిద్రపోయి కల కన్నాను. నేను నిద్రలేచి చూశాను.. జీవితమంతా సేవ అని తెలిసింది. చివరకు సేవ చేయడమే సంతోషభరితమని గుర్తించాను’’ అని ఓ సూక్తిని పేర్కొని అది రాసింది జిబ్రాన్‌ అని ఆయన చెప్పారు.

దీంతో నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. ‘‘ఇది రాసింది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌. కానీ, ఈ నయా పాకిస్థాన్‌ ప్రధాని మాత్రం దీన్ని జిబ్రాన్‌ రాశారని అనుకుంటున్నారు. పాకిస్థాన్‌ తన గురించి తాను జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే మీ దేశ ప్రధాని స్థిరంగాలేరు’’ అని ఒక నెటిజన్‌ విమర్శించారు. ‘‘ఇమ్రాన్‌ నుంచి మరో తెలివి తక్కువ ట్వీట్ వచ్చింది’’ అని ఒకరు సెటైర్‌ వేశారు. ‘‘మిస్టర్‌ ప్రధాని మీరు ఎల్లప్పుడూ రైటే.. మీకో దండం’’ అని ఒక నెటిజన్‌ చమత్కరించాడు. ‘‘తెలివి తక్కువతనానికి మీరే చిరునామా.. ఇది మీ తప్పు కాదు మీరు చదువుకున్న సంస్థ మీకు ఈ విషయాన్ని నేర్పలేదు..మీ ఐక్యూ స్థాయి చాలా ఎక్కువగా ఉంది’’అంటూ కొందరు చురకలంటించారు.      

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.