close

తాజా వార్తలు

గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగి ఆత్మహత్య

మాదాపూర్‌: ఓ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం విజయవాడ ఎస్‌ఎన్‌ పురం ప్రాంతానికి చెందిన పి. రఘురామ్‌(35) కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చారు. చందానగర్‌లో నివాసం ఉంటున్న ఆయన.. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో పనిచేస్తున్న శ్రీదేవితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమార్తె ఉంది. అయితే రఘురామ్‌ గత కొంతకాలంగా బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం తన భార్యతో కలిసి విధులకు వెళ్లిన ఆయన.. ఉదయం 11 గంటలకు సంస్థ నుంచి బయటకు వచ్చి సమీపంలో ఉన్న మంత్రి అపార్ట్‌మెంట్స్‌ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రఘురామ్‌ అక్కడికక్కడే మరణించాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.