
తాజా వార్తలు
విజయవాడ: మూడేళ్లపాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నానని.. ప్రభుత్వ వైఖరితో నాలుగు నెలలకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ప్రజల కష్టాల గురించి తాము అడిగితే వ్యక్తిగత విషయాలను ఎత్తిచూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జనసేన అంటే భయపడే వ్యక్తిగత విషయాల జోలికి వస్తున్నారన్నారు. ‘‘ప్రతిసారీ నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటున్నారు.. నేను పెళ్ళిళ్లు చేసుకుంటే మీకొచ్చిన ఇబ్బందేంటి? నా వ్యక్తిగత పరిస్థితి వల్ల చేసుకున్నాను. వాటి వల్లే మీరు రెండేళ్లు జైలుకు వెళ్లారా?’’ అని జగన్‌ను ఉద్దేశించి పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎం వైకాపా నాయకుడిలా కాకుండా బాధ్యతగల వ్యక్తిగా మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు.
తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయండి
తెలుగు భాషే తమకు సంస్కారాన్ని నేర్పిందని పవన్ అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రపై సీఎం జగన్‌కు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రాతిపదికన ఏపీ ఏర్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఆంగ్లంలో శిక్షణ ఇవ్వకుండా పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చిన తర్వాతే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని పవన్ సూచించారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాక రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని అమలు చేయాలన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- వారంలో ఖతం
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
