Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145544
            [news_title_telugu_html] => 

నిధుల జమకీ ఖాతాదారుడి అనుమతి కావాల్సిందే?

[news_title_telugu] => నిధుల జమకీ ఖాతాదారుడి అనుమతి కావాల్సిందే? [news_title_english] => Banks may seek permission before transfer of money to ur acc services may start soon [news_short_description] => ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఖాతాదారుడి అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని బ్యాంకులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు .... [news_tags_keywords] => Deposits,Bank,RBI,Nirmala Sitharaman,Budget 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 10:49:31 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నిధుల జమకీ ఖాతాదారుడి అనుమతి కావాల్సిందే? - Banks may seek permission before transfer of money to ur acc services may start soon - EENADU
close

తాజా వార్తలు

నిధుల జమకీ ఖాతాదారుడి అనుమతి కావాల్సిందే?

దిల్లీ: ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ ఖాతాదారుడి అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని బ్యాంకులు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలోనే వెల్లడించినా.. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలపై ఆర్బీఐకి లేఖ రాసినట్లు తెలిసింది. నూతన విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తామని.. వారు అనుమతిస్తేనే డబ్బులు డిపాజిట్‌ అవుతాయని దీంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. లావాదేవీని అనుమతించడం లేదా తిరస్కరించడం ఖాతాదారుడి అభీష్టానికే వదిలేయనున్నట్లు తెలిపారు. 

నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఖాతాల్లో అక్రమంగా నగదు చేరినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. నల్ల ధనాన్ని చట్టబద్ధంగా మార్చుకోవడానికి జన్ ధన్‌ ఖాతాలను విరివిగా వాడుకున్నట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి మోసాలను అరికట్టడానికే కొత్త విధానం అమలులోకి రానుంది. ‘‘ నగదు జమ విషయంలో ఖాతాదారుడికి తన ఖాతాపై సాధికారిత ఉండేలా ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు తీసుకురాబోతున్నాం. ఆ దిశగా చర్యలు ప్రారంభించాం’’ అని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

అయితే ఈ సేవలు అందరికీ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ సేవల్ని పొందడానికి బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం.. ఖాతాదారుడికి తన అకౌంట్‌కి సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం ఖాతా నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఉంటే నగదు జమ చేయవచ్చు.   


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.