నాలుగు రోజులు జోరు వానలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు రోజులు జోరు వానలు

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీనికితోడు శుక్రవారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో శుక్రవారం (11వ తేదీ) నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. 12, 13 తేదీల్లో ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది. గురువారం దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. గరిష్ఠంగా కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మెనూర్‌లో 12.1 సెం.మీ. నమోదయింది. మద్నూర్‌లో 11.5, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 9.5, ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌ మండలం భోర్జలో 9.3, సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో 9.2 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగానూ వర్షం నమోదయింది.
జూరాలకు 16,600 క్యూసెక్కుల వరద
కృష్ణా నదిలో ఎగువ నుంచి వరద వస్తుండడంతో జూరాల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం ఎగువ నుంచి 16,600 క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా.. విద్యుత్తు కేంద్రం ద్వారా దిగువకు 12,299, కాల్వలకు 4,621 క్యూసెక్కులు వదులుతున్నారు. జూరాలలో ప్రస్తుతం 9.46 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఆలమట్టికి ఎగువ నుంచి 6,952 క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 12,089 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మిగిలిన జలాశయాలకు స్వల్పంగా ప్రవాహం కొనసాగుతోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని