జోనల్‌ నిబంధనలు తప్పనిసరి

ప్రధానాంశాలు

జోనల్‌ నిబంధనలు తప్పనిసరి

నియామకాలు, పదోన్నతుల్లో విధిగా పాటించాలి
  కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇకపై జరిగే ఉద్యోగాల భర్తీ, నియామకాలు, పదోన్నతు(రిక్రూట్‌మెంట్‌, అపాయింట్‌మెంట్‌, ప్రమోషన్‌)ల్లో కచ్చితంగా జోనల్‌ నిబంధనలు పాటించాలని అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగ నియామకాలు (స్థానిక కేడర్లు, ప్రత్యక్ష నియామకాల) ఉత్తర్వు-2018ను అమలు చేయాలని సూచించింది. నియామకాలు, పదోన్నతుల సమయంలో రాష్ట్ర, రెండు బహుళ జోన్లు, ఏడు జోన్లు, 33 జిల్లాలను పరిగణనలోనికి తీసుకొని స్థానిక రిజర్వేషన్లను వర్తింప చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త జోనల్‌ నిబంధనలకు ఏప్రిల్‌ 19న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా... దానికి అనుగుణంగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లను అమలు చేయాలని, అయిదు శాతాన్ని ఓపెన్‌ కోటాగా పరిగణించాలని జూన్‌ 30న ప్రభుత్వం అన్ని శాఖలకు నిర్దేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని