పెరిగిన తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం

ప్రధానాంశాలు

పెరిగిన తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం

దేశవ్యాప్తంగా లక్ష కోట్లు దాటిన రాబడి

ఈనాడు, దిల్లీ: గతేడాది జులైతో పోలిస్తే ఈ సంవత్సరం జులైలో తెలుగు రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయం 25 శాతానికి పైగా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ ఆదివారం విడుదల చేసిన జులై లెక్కల ప్రకారం.. ఆ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,730 కోట్లు, తెలంగాణకు రూ.3,610 కోట్ల ఆదాయం వచ్చింది. ఏపీకి గతేడాది జులైలో రూ.2,130 కోట్లు రాగా ఈసారి అది 28% వృద్ధి చెందింది. తెలంగాణకు క్రితం సారి రూ.2,876 కోట్లు రాగా ఈసారి అది 26% పెరిగింది. గతేడాది జులైలో రాష్ట్రాలకు రూ.66,291 కోట్ల జీఎస్‌టీ ఆదాయం రాగా ఈసారి 32% పెరిగి రూ.87,678 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వానికి జులైలో రూ.1,16,393 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది కంటే 33% అధికం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని