logo

అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య

వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది.

Updated : 05 May 2024 08:13 IST

సఫియా (పాతచిత్రం)

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి కథనం మేరకు... ములుగు జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపూర్‌ గ్రామానికి చెందిన రాంనర్సయ్యకు 20 ఏళ్ల క్రితం అదే జిల్లాలోని ఏటూరునాగారం గ్రామానికి చెందిన సఫియా (38)తో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయశాఖ ఉద్యోగులే. ప్రస్తుతం హనుమకొండ ఎక్సైజ్‌కాలనీలో నివాసం ఉంటున్నారు. రాంనర్సయ్య వర్ధన్నపేట మండలంలో, సఫియా వడ్డేపల్లిలోని కార్యాలయంలో పని చేస్తున్నారు. వీరికి 16 ఏళ్ల కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రాంనర్సయ్య చెడు వ్యసనాలకు బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని హింసించసాగాడు. ఇటీవల పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇద్దరికి సర్దిచెప్పి పంపించారు. అయినా రాంనర్సయ్య తీరులో మార్పు రాకపోవడంతో సఫియా శనివారం ఉదయం 6 గంటల సమయంలో పడక గదిలోకి వెళ్లి, లోపల తాళం వేసి చున్నీతో ఉరివేసుకొంది. భర్త, కుమార్తె గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆమె మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని