
తాజా వార్తలు
మయన్మార్‌లో ఘోరం: 113 మంది మృతి
కాచిన్: మయన్మార్‌లోని కాచిన్ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. జాడె అనే ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మంది కార్మికులు మృతిచెందారు. వందలాది మంది గనుల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కొండచరియల కింద మరికొందరు చిక్కుకోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.
Tags :