
తాజా వార్తలు
ఉద్రిక్తంగా రైతుల ‘చలో దిల్లీ’ ఆందోళన
పోలీసులపైకి రాళ్లు.. బారికేడ్లు పడేసిన రైతులు..
చండీగఢ్: నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కరోనా నేపథ్యంలో రైతుల ఆందోళనకు దిల్లీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. దీంతో దిల్లీ సరిహద్దుల్లో హరియాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా హైవే వద్ద రైతులను బలగాలు నిలువరించాయి. దీంతో ఆగ్రహించిన రైతులు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
రైతుల ఆందోళన నేపథ్యంలో హరియాణా నుంచి దిల్లీ వచ్చే మార్గాల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. దిల్లీలోకి రైతులు రాకుండా సోనిపట్ వద్ద సరిహద్దులను మూసేసి సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు రోహ్తక్-ఝజ్జర్ సరిహద్దుల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
కేజ్రీవాల్ విమర్శలు..
రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ‘కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు ప్రయోగిస్తున్నారు. శాంతియుత ఆందోళనలు చేయడం రాజ్యాంగ హక్కు. రైతులపై జలఫిరంగులు ప్రయోగించడం కచ్చితంగా తప్పే’ అని కేజ్రీవాల్ కేంద్రాన్ని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి..
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
