3రోజులు..300లోపు కొవిడ్ మరణాలు

తాజా వార్తలు

Published : 28/12/2020 10:21 IST

3రోజులు..300లోపు కొవిడ్ మరణాలు

24 గంటల్లో 20,021 కొత్త కేసులు..279 మరణాలు

దిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం 20,021 మందికి వైరస్ సోకగా, మొత్తం కేసుల సంఖ్య 1,02,07,871గా ఉంది. అలాగే అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్యలో కాస్త పెరుగుదల కనిపించింది. 

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,77,301(2.74శాతం)కు తగ్గింది. అలాగే నిన్న ఒక్కరోజే 21,131 మంది వైరస్‌ నుంచి కోలుకోగా..గత నెల రోజులుగా పాజిటివ్ కేసులకంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 95.82శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో కోలుకున్న వారి సంఖ్య 97,82,669గా ఉంది. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 279 మంది ఈ వైరస్‌కు బలికాగా మొత్తంగా 1,47,901 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా, వరసగా మూడు రోజులుగా 300లోపే మరణాలు నమోదు కావడం ఊరటనిస్తోంది. కాగా, ఐసీఎంఆర్ వివరాల ప్రకారం.. ఆదివారం కేవలం 7,15,397 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు 16,88,18,054 మంది నమూనాలను స్వీకరించారు. 

ఇవీ చదవండి:

జనవరి తొలివారంలో ఆక్స్‌ఫర్డ్ టీకా?

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ..66మందికి కరోనా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని