ఉ.కొరియాలో క‌రోనా: ఒక్క కేసూ న‌మోదు కాలేద‌ట‌!

తాజా వార్తలు

Published : 04/07/2020 18:03 IST

ఉ.కొరియాలో క‌రోనా: ఒక్క కేసూ న‌మోదు కాలేద‌ట‌!

కిమ్ ప్ర‌క‌ట‌న‌పై అనుమానాలు..!

సియోల్‌: అతిస్వ‌ల్ప కాలంలోనే ప్ర‌పంచాన్ని చుట్టేసిన క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దాదాపు అన్ని దేశాల‌ను వ‌ణికిస్తోంది. కానీ, ఈ స‌మ‌యంలో ఉత్త‌ర కొరియాలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ట‌. ఈ విష‌యాన్ని ఉత్త‌ర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌జ‌లు మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాడు. అంతేకాదు, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఊహించ‌లేని, ఎప్ప‌టికీ కోలుకోలేని సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని ఉత్త‌ర కొరియా అధికారుల‌ను హెచ్చ‌రించాడు.

ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదుకాలేద‌ని దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ పున‌రుద్ఘాటించారు. ప్ర‌పంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిని త‌మ దేశంలోకి రానివ్వ‌కుండా నిరోధించామ‌ని తాజాగా జ‌రిగిన అధికార పార్టీ స‌మావేశంలో కిమ్‌ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని ఉత్త‌ర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్ల‌డించింది.

జూన్‌19 నాటికి దేశంలో 922 మందికి కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వహించగా ఒక్క పాజిటివ్ కేసు బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు 25,551మందిని క్వారంటైన్ నుంచి విడుద‌ల చేయ‌గా మ‌రో 255మంది మాత్రం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇదే విష‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు ఉ.కొరియా ఆరోగ్యశాఖ తెలిపిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. అయితే, స‌రిహ‌ద్దు దేశాలైన ద‌క్షిణ కొరియాలో ఇప్ప‌టివ‌రకు 13వేల పాజిటివ్ కేసులు న‌మోదుకాగా చైనాలో 83వేల కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. అయినా ఉత్త‌ర కొరియాలో ఒక్క పాజిటివ్ కేసు న‌మోదుకాక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం.  

ఊహించ‌ని సంక్షోభం ఎదురుకావొ‌చ్చు..!

పొరుగు దేశాల్లో వైర‌స్ ఉద్ధృతి కొన‌సాగుతున్న దృష్ట్యా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌కుండా, ఎలాంటి స‌డ‌లింపులు ఇవ్వ‌కూడ‌ద‌ని పార్టీ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో కిమ్ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిపింది. కఠిన నిబంధ‌న‌లు అమ‌లుచేస్తున్న స‌మ‌యంలో ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేపడితే రాబోయేరోజుల్లో ఊహించ‌ని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని ఆయన అధికారుల‌ను హెచ్చ‌రించాడు. ఒక‌వేళ అలా జ‌రిగితే మాత్రం తిరిగి కోలుకోలేమ‌ని కిమ్‌ అభిప్రాయ‌ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

కిమ్ ప్ర‌క‌ట‌న‌పై అనుమానాలు..!

వైర‌స్ బారినుంచి త‌మదేశాన్ని ర‌క్షించుకోవ‌డంలో భాగంగానే క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌లుచేశామ‌ని ఉత్త‌ర కొరియా స‌మ‌ర్థించుకొంటోంది. దీనిలోభాగంగా ఈ సంవ‌త్స‌రం ఆరంభంలోనే దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేసిన ప్ర‌భుత్వం, వైర‌స్ ల‌క్ష‌ణాలున్న‌వారిని నిర్బంధంలో ఉంచిన‌ట్లు పేర్కొంది. అయితే, క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాతో ఉత్త‌ర కొరియాకు బ‌ల‌మైన‌ వాణిజ్య బంధం ఉంది. అంతేకాకుండా అర‌కొర‌‌ ఆరోగ్య స‌దుపాయాలున్న‌ ఉత్త‌ర కొరియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌కేసు న‌మోదుకాక‌పోవ‌డంపై నిపుణులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో కిమ్‌ చ‌ర్య‌ల‌ను మాత్రం నిపుణులు వ్య‌తిరేకిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని