close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042502 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => PtVdz-qMvYU [video_short_link] => PtVdz-qMvYU [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-29 15:56:42.75538 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

అంతర్‌ రాష్ట్ర సరిహద్దులను మూసివేయండి: కేంద్రం

వలస కూలీలకు 14 రోజుల క్వారంటైన్‌కు తరలించాలని ఆదేశం

దిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, కూలీలు రాష్ట్రాలు, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అవకాశం ఉన్నంత వరకు జాతీయ రహదారుల పక్కనే క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాజీవ్‌ గౌబా సూచించారు. అయితే ఇప్పటికే తమ సొంత ప్రాంతాలకు పయనమైన వలస కూలీలను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని క్వారంటైన్లకు తరలించాలని ఆదేశించారు. ఈ చర్యతో కరోనా వ్యాప్తిచెందకుండా నివారించవచ్చని అన్నారు. విపత్తు నివారణ చట్టం కింద జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కేంద్రం ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో పలు ప్రాంతాల్లోని వలస కూలీలు పనులు లేక తమ సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. అయితే మార్గమధ్యంలో పలు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వలస కూలీలు దిల్లీ నుంచి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవ్వడంతో ఆయా ప్రభుత్వాలు వారిని తరలించేందుకు 1000కి పైగా బస్సులను సిద్ధం చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడురోజుల్లో 1.5లక్షల మంది రాగా వారందరిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి భోజన వసతి సౌకర్యాలు కల్పించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ కూడా ప్రతి జిల్లా సరిహద్దుల్లో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వలస కూలీలను అక్కడికి తరలించి ఆ తర్వాత వారి సొంత గ్రామాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.