కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలం: థరూర్‌

తాజా వార్తలు

Updated : 20/09/2020 22:31 IST

కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలం: థరూర్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌ ఆదివారం కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో కేంద్రం విఫలమైందని ఆరోపణలు గుప్పించారు. లోక్‌సభలో కరోనాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోయాం. ఇటు ఆర్థిక వ్యవస్థను పైకి తీసుకురాలేకపోయాం. 41 ఏళ్లలో తొలిసారి మన జీడీపీ బాగా క్షీణించింది. ఇక నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సైతం దిగజారిపోయాయి. వాణిజ్యం కుప్పకూలిపోయింది’’ అని విమర్శించారు.

‘‘కేంద్రం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించే ముందు రాష్ట్రాలను సంప్రదించలేదు. ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ విపత్తును కురుక్షేత్రంతో పోల్చారు. మహాభారతంలో 18 రోజులు కష్టపడితే విజయం దక్కింది. అలా కొవిడ్‌పై 21 రోజులు లాక్‌డౌన్‌ పాటించడం ద్వారా దాన్ని నివారించవచ్చన్నారు. కానీ ఇప్పటికి 180 రోజులు గడిచాయి. ఇప్పుడు మన దేశం కేసుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నిత్యం కేసులు లక్షకు చేరువ అవుతున్నాయి. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఇతర దేశాలతో పోలిస్తే.. చాలా ఆందోళనకరంగా ఉంది’’ అని థరూర్‌ విమర్శించారు. ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని