
తాజా వార్తలు
కొవిడ్‌పై మోదీ అఖిలపక్ష భేటీ ప్రారంభం
దిల్లీ: దేశంలో కొవిడ్ మహమ్మారి పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్, ఎన్సీపీ తరఫున శరద్ పవార్, తెరాస తరఫున నామా నాగేశ్వరరావు, శివసేన నుంచి వినాయక్ రౌత్ తదితరులు ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం.
దేశంలో కరోనా విజృంభించిన తర్వాత ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించడం ఇది రెండోసారి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్, ప్రహ్లాద్ జోషీ, అర్జున్ రామ్ మేఘవాల్, వి. మురళీధరన్ పాల్గొన్నారు.
కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పురోగతి, టీకా పంపిణీ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇటీవల ఒకేరోజు మూడు నగరాల్లో పర్యటించి టీకా ప్రయోగాలను సమీక్షించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో మూడు ఫార్మా సంస్థలతో వర్చువల్‌గా సమావేశమై వ్యాక్సిన్ అభివృద్ధిని ఆరా తీశారు. ఈ విషయాలను మోదీ అఖిల పక్ష నేతలకు వివరించనున్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
