
తాజా వార్తలు
చైనా-భారత్ ఉద్రిక్తతల నివారణకు ఇదే మార్గం..
దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు కట్టుబడి ఉండకపోవటమే ప్రస్తుతం భారత్-చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముఖ్య కారణమని భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పేందుకు ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, దౌత్య నియమాలను పాటించడమే మార్గమని భారత్ ప్రకటించింది.
అగ్రరాజ్యానికి చెందిన యూఎస్-చైనా ఎకనమిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ వెలువరించిన తాజా వార్షిక నివేదిక.. గాల్వన్ లోయ ఘటన చైనా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చోటుచేసుకుందని తెలిపింది. తూర్పు లద్దాఖ్‌లోని 17 వేల అడుగుల ఎత్తయిన గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఇరవై మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. కాగా, తమ వైపు జరిగిన ప్రాణ నష్టం గురించిన వివరాలను చైనా స్పష్టంగా వెల్లడించలేదు.
ఈ విషయమై మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ స్పందించారు. భారత్-చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను చక్కదిద్దేందుకు ఇరుదేశాలు 1993, 1996 ఒప్పందాలతో సహా అన్ని ఒప్పందాలను, ప్రోటోకాల్స్‌ను పాటించటం అత్యవసరం అని నొక్కి చెప్పారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- కూలీలపైకి దూసుకెళ్లిన లారీ..15 మంది మృతి
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
