భారత్‌- చైనా వివాదం: అమెరికా కీలక చర్య

తాజా వార్తలు

Published : 16/12/2020 14:24 IST

భారత్‌- చైనా వివాదం: అమెరికా కీలక చర్య

వాషింగ్టన్‌: వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో కయ్యాలకు తెగబడుతున్న చైనాకు సంబంధించి అమెరికా చట్ట సభ ఓ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఆ దేశ  రక్షణ బిల్లు నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్డీఏఏ)కు అక్కడి కాంగ్రెస్‌ ఆమోద ముద్ర లభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌పై చైనా దురాక్రమణ గురించి భారత సంతతి కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తీర్మానం కూడా ఇదే బిల్లులో భాగంగా ఉంది. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌, సెనేట్‌లు రెండూ ఎన్డీఏఏకు ఆమోదం తెలపడంతో.. ఈ తీర్మానానికి కూడా సమ్మతి లభించినట్లయింది. ఈ బిల్లును ఆపేందుకు తన విశేషాధికారమైన వీటోను వాడుతానని ట్రంప్‌ బెదిరించినప్పటికీ.. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బిల్లు కాంగ్రెస్‌ ఆమోదం పొందింది.

తాజా బిల్లు ఆమోదంతో.. ఈ విషయంలో చైనాకు అమెరికా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లే అని రాజా కృష్ణమూర్తి అన్నారు. భారత్‌తో సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం చైనాకు స్పష్టం చేసినట్టయిందని అయన తెలిపారు. సరిహద్దు వివాదాలను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు భారత్‌ వంటి మిత్రదేశాలకు అగ్రరాజ్యం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా ప్రకటించారు.

ఇవీ చదవండి

చైనా చర్యలు రెచ్చగొట్టేవే..

చైనాకు చెక్ పెడదాం..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని