Bus: గమ్యం లేని బస్సు ప్రయాణం.. నిద్రే లక్ష్యం!

తాజా వార్తలు

Published : 23/10/2021 01:15 IST

Bus: గమ్యం లేని బస్సు ప్రయాణం.. నిద్రే లక్ష్యం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజంతా ఎంతో కష్టపడతాం.. దీంతో అలిసిపోయి రాత్రి హాయిగా నిద్రకు ఉపక్రమించేస్తాం. కానీ, కొంతమందికి అస్సలు నిద్ర పట్టదు. అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అయితే.. వద్దన్నా నిద్ర కమ్ముకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన హాంకాంగ్‌లోని ఉలూ ట్రావెల్స్‌ అనే సంస్థ ‘స్లీపింగ్‌ బస్‌ టూర్‌’ పేరుతో వినూత్న సేవల్ని ప్రవేశపెట్టింది. ఇంట్లో పడకపై నిద్ర పట్టని వారు తమ బస్సులో ప్రయాణిస్తూ ఐదు గంటలపాటు నిద్రపోవచ్చని తెలిపింది. హాంకాంగ్‌ పరిధిలో తమ డబుల్‌ డెక్కర్‌ బస్‌ ఐదుగంటలపాటు 75కి.మీ మేర గమ్యం లేకుండా తిరుగుతుందని.. చివరకు ఎక్కిన చోటే దించేస్తుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. టికెట్‌ ధర సీటు ఎంపికను బట్టి 13 డాలర్ల నుంచి 51 డాలర్ల వరకు ఉంటుందట. ప్రయాణికులకు కళ్లకు పెట్టుకునే మాస్క్‌, గూడీ బ్యాగ్‌, బయటి శబ్దాలు వినిపించకుండా చెవులకు ఇయర్‌ ప్లగ్స్‌ను ఇస్తారు. కాగా.. ప్రయాణికులు తమకు అనువుగా ఉండేలా రాత్రి వేసుకునే దుస్తులు, బ్లాంకెట్లు కూడా తెచ్చుకోవచ్చు. ఇటీవల ఈ సేవల్ని ప్రారంభించగా.. సీట్లన్ని నిండిపోయాయట. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ఉలూ ట్రావెల్స్‌ ఈ సేవల్ని మరింత విస్తరించే ప్రయత్నంలో ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని